ఏలేశ్వరం:-విజయ నర్సింగ్ హోమ్ అధినేత ప్రముఖ వైద్యులు ఎస్ విజయబాబు వైకాపా పార్టీని వీడి తన స్వగ్రామమైన మర్రివీడి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ వైద్యునిగా, మత బోధకుడిగా పేద ప్రజలకు అనేక సేవలు చేశానని, పార్టీ ఆహ్వానం మేరకు తాను తెలుగుదేశం పార్టీలో భాగం అవ్వడంతో పేద ప్రజలకు మరింత సేవలు చేసే అవకాశం లభించింది అన్నారు. పార్టీ విజయానికి తాను కృషి చేస్తానన్నారు. వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ డాక్టర్ విజయబాబు తో పాటు మరో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లు అమె తెలిపారు.పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి ఘన స్వాగతం పలుకుతున్నాము అన్నారు.ప్రతీ ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో సఖిరెడ్డి ప్రభాకరరావు,వైస్ ప్రెసిడెంట్ కలగా వీరబాబు, విద్యాకమిటి చైర్మన్ ఎలుగుబంటి చినబాబు,
ఓలుపల్లి శ్రీకాంత్, నీలి సత్యనారాయణ, కొప్పిశెట్టి సూరిబాబు, బుజ్జిరాజు, జాకోబు పాస్టర్, సూతి బూరయ్య, జ్యోతుల పెదబాబు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), బొద్దిరెడ్డి గోపాలకృష్ణ(గోపి), మందపాటి అలార్కరాజు, ఎస్ జి వి సుబ్బరాజు, చిక్కాల లక్ష్మణరావు,బాజంకు కన్నారావు, వీరంరెడ్డి తాతబాబు,కొప్పుల బాబ్జి, బసా ప్రసాద్, చల్లా రాజారావు, పలివెల శ్రీనివాస్, బెల్లాని శ్రీను, నూకథాటి ఈశ్వరుడు, మైరాల కనకారావు, పెంటకోట శ్రీధర్, బర్ల కృష్ణ అర్జునుడు తదితరులున్నారు.