జగ్గంపేట

జగ్గంపేటలో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం జగ్గంపేట పద్మనాభ నగర్ లో మంగళవారం రాత్రి జరుగుతుండగా రాష్ట్ర విభిన్న ప్రతిభవంతుల వయోవృద్ధుల మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. నెహ్రూ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఈరోజు తీసుకున్న దివ్యాంగులు వయోవృత్తుల పెన్షన్ కోసం నిర్ణయం చరిత్రత్మకమైనదని 6000, 10000, 15000 విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ పెంచడం జరిగిందని 4000 రూపాయలు అవ్వ తాతలకు పెన్షన్ పెంచడం జరిగిందని టిడిపి, జనసేన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలంటే జగ్గంపేట నియోజకవర్గం నుండి జ్యోతుల నెహ్రు అన్నను ప్రజలను ఆయన గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శిఎస్ వి ఎస్ అప్పలరాజు, కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

