Sunday, February 15, 2026

Creating liberating content

టాప్ న్యూస్జ్ఞాన్ వాపీ మసీదు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు

జ్ఞాన్ వాపీ మసీదు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు

వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు నేడు కీలక ఆదేశాలు వెలువరించింది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ… మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభమవుతుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను తాము పై కోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు.
జ్ఞాన్ వాపి మసీదు దక్షిణ భాగంలోని సెల్లార్ లో మరో వారం రోజుల్లో పూజలను ప్రారంభిస్తామని హిందూ పక్షం తరఫున వాదించే న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెలల్డించారు. ఇష్ట దైవానికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. కాగా, ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. పిటిషన్ ను కొట్టివేయాలని మసీదు కమిటీ చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article