చుట్టూ ముట్టి పట్టుకున్న పోలీసుల బృందం
హనుమంతునిపాడు :హనుమంతునిపాడు మండలంలోని ముప్పళ్లపాడు పంచాయతీ విరగారెడ్డిపల్లి గ్రామంలో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. పందెం రాయుళ్ల తోపాటు బెట్టింగ్ రాయుళ్లు కలిసి జూదమే వేదముగా భావించి వారి ఇష్టానుసారంగా తోచినప్పుడల్లా కోడి పందేలు జరుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హనుమంతునిపాడు సబ్ ఇన్స్పెక్టర్ నిఘా ఉంచి పోలీసుల బృందంతో పందెం రాయుళ్లను చుట్టూ ముట్టి పట్టుకున్నారు. పది మంది పందెం రాయుళ్లు దొరకగా వారి నుండి రెండు కోడి పుంజులు, 11500 రూపాయలు డబ్బులు, ఐదు బైకులు, పన్నెండు కోడికత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమంతునిపాడు యెస్ ఐ పులి శివనాగరాజు తెలిపారు. చాకచక్యంగా పదిమంది పందెం రాయుళ్లను పట్టుకొనిన హనుమంతునిపాడు యెస్ ఐ మరియు పోలీసు సిబ్బందిని గ్రామస్థులు అభినందించు చున్నారు.