ప్రజాభూమి బ్రహ్మంగారిమఠం
జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పంచదశోత్తర చతుశ్వత(415)
జయంతి మహోత్సవాలు సందర్భంగా జై వీర బ్రహ్మ జై గోవింద జై అంటూ బ్రహ్మంగారిమఠం మారు మోగింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆలయ ప్రాంగణంలో రెండు రోజులు పూజలో ఉంచిన 415 కలశాలును ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ దేవస్థానం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి పూజ శ్రీ పూర్వపు మఠాధిపతులు శ్రీ శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి కుమారులు శ్రీ వెంకటాద్రి స్వామి శ్రీ భద్రయ్య స్వామి శ్రీ వీరంభట్లయ్య స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ గోవింద స్వామి శ్రీ వరదరాజులు స్వామి ఆధ్వర్యంలో ఆలయం పురవీధుల గుండా కలశాలను మహిళా భక్తులు స్థానికులు తల మీద ఉంచుకొని స్థానిక వీరబ్రహ్మేంద్ర పార్క్ ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శిలా మూర్తికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాత్రికి శ్రీ గోవింద మాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే హరికథా కాలక్షేపం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గ్రామ ఉత్సవం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్నదాన కార్యక్రమం చలువ పందిరిలు విద్యుత్ దీపాలంకరణ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన స్థానిక ఎస్సై విద్యాసాగర్ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.