జీలుగుమిల్లి
అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జీలుగుమిల్లి పంచాయతీలో ఉన్న కోదండ రామాలయాలు దగ్గర భజనలు రామ కీర్తనలుతో పాటు నగర సంకీర్తన చేస్తూ భక్తులు అందరూ భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి చాక్ట్రాతి ప్రసాదు పంచాయతీ ప్రెసిడెంట్ కె వి ప్రసాద్ అద్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహింప చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్ట వరకు కూడా వివిధ గ్రామాలలో రామాలయాలలో వివిధ గుడి ప్రాంగణాలలో బాల రాముని పేరుతో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహింపజేశారు అనేక ప్రాంతాలలో భజనలు కోలాటాలు నిత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు .
జై శ్రీరామ్ నినాదాలతో మారుమురోగాయి. ఆయా ప్రాంతాలలోని గూడులను తోరణాలతో అలంకరింపజేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో అయోధ్య రాముని సందడే నెలకొంది. ఎవరి నోట విన్న ఏ ప్రాంతంలో చూసిన జైశ్రీరామ్ జండాలు రెపరెపలాడాయి. ఏ సందులో చూసిన ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలతో పాటు గ్రామంలోని చిన్న పెద్ద అందరూ కూడా రాముని తలుచుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మరో భద్రాది ఉత్సవాలుగా నిర్వహింపచేస్తున్నారు.