- ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం అమలు ఘనత వైఎస్ఆర్సీపీ దే..
- ప్రజా పాలనలో కీలక సంస్కరణలు.. అన్ని రంగాలలో ప్రగతికి సోపానం
- చంద్రగిరి ప్రజల రుణం తీర్చుకోలేనిది..
- ప్రజలే కుటుంబంగా.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేవా కార్యక్రమాలు
- ” వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
రామచంద్రాపురం,*
“వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమం ద్వారా తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రామచంద్రాపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. గురువారం మండల పరిధిలో మిట్టకండ్రిగ, కుప్పంబాదూరు, సి.కే.పల్లి, నెత్తకుప్పం, అనుపల్లి పంచాయతీలలో చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మహిళలు హారతులు, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట ఆయా పంచాయతీల్లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరణలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అభివృద్ధి, సంక్షేమ జాబితా బోర్డ్ లను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలనలో కీలక సంస్కరణలు
రాష్ట్రంలో మెరుగైన ప్రజా పాలనకు సీఎం జగనన్న కీలక సంస్కరణలు చేపట్టారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్కరణలు అన్ని రంగాలలో ప్రగతికి సోపానంగా నిలిచాయన్నారు. ఆర్థిక ప్రగతిలో సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారన్నారు. సమాజంలో అత్యంత బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వారి ఆర్థిక పురోగతికి సంక్షేమ ఫలాలు అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆర్థిక అసమానతలను రూపుమాపి వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రశంసించారు. నాణ్యమైన విద్య, వైద్యం, మెరుగైన పోషణ, జీవనో పాధి కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధి గూర్చి బ్యాంకు ఖాతాలే తెలియజేస్తాయన్నారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో పేదల చదువులకు బాసటగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, జగ నన్న విద్యా కానుక పథకాలను అమలు చేసి పేదల పక్షపాతిగా నిలిచాడన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు మన ఇంటికే చేరాలంటే జగనన్న కోసం సైనికుల్లా పని చేద్దామని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
చంద్రగిరి ప్రజల రుణం తీర్చుకోలేనిది
చంద్రగిరి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధారణ కార్యకర్త అయిన నా తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కున చేర్చుకొన్నారని తెలిపారు. అందుకే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి ఎనలేని సేవ చేస్తున్నారని వెల్లడించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేశారన్నారు. రాయల చెరువు కు గండి పడి ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మునక ప్రాంత ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచి భరోసా కల్పించారన్నారు. కట్టపైనే ఉంటూ అలుపెరగకుండా కట్ట బలోపేతానికి కృషి చేశారని వెల్లడించారు. పల్లెల ప్రగతికి రూ.కోట్ల తుడా నిధులను వెచ్చించారన్నారు. సొంత నిధులతో ప్రజలకు పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, సంతల్లో ఉచిన భోజన సదుపాయాలు, కూరగాయల విక్రయానికి రైతులకు ఉచిత గేటు వంటి తదితర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఆయన తనయుడిగా ప్రజా సేవలో తరించేందుకు మీ ముందుకు వచ్చానన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీ బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
పలు ప్రారంభోత్సవాలు..
మండలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను మోహిత్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బాదూరులో రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, నెత్త కుప్పంలో వాటర్ ప్లాంట్, రూ.23.90 లక్షల రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం, కొత్తవేప కుప్పంలో ఆర్వో వాటర్ ప్లాంట్, కొత్త వేపకుప్పం ఆర్వో వాటర్ ప్లాంట్ లను మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాలు క్రమంలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డ్ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పిటిసి ఢిల్లీ భాను కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పుష్పాంత్ రెడ్డి, బీసీ సంఘ నాయకులు మురగయ్య , డివిజన్ అధ్యక్షులు వెంకట రెడ్డి , చిట్టి నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నెల్లేపల్లి వెంకటేష్, ఎంపీటీసీ మంజుల సిద్ధారెడ్డి, యశ్వంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మారారెడ్డి, మనోహర్ రెడ్డి, బికి రెడ్డి, రామిరెడ్డి,సర్పంచులు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.