వస్త్రలత వద్ద హ్యాకర్ల నిరసన
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
తమ షాపులను తొలగిస్తే తమ ఆత్మహత్యలే మాకు శరణ్యమని పాతబస్తీలోని చిరువ్యాపారులు హెచ్చరించారు. తమ వ్యాపారాలకు అధికారులు నిర్దిష్టమైన హద్దులు నిర్ణయించాలని ఆ హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు , ట్రాఫిక్ పోలీసులు ఇరువురు కలిసి తమ షాపులను తొలగించాలని ఆదేశాల ఇవ్వట సరికాదని చిరు వ్యాపారస్తులు అధికారుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే వెస్ట్ బుకింగ్ వద్ద ముషాఫిర్ ఖానా సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టు ట్రాఫిక్ కి అంతరాయం లేని వస్త్రలత హకర్స్ గత 50 ఏళ్ల నుండి చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే వారిని మాత్రం అక్కడ నుండి తొలిగించడానికి రంగం సిద్ధం చఢయడం అన్యాయమన్నారు. సమోసాలు, జిలేబిలు, అమ్ముకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటుంటే అగస్మాత్తుగా ఇప్పటికిప్పుడు అధికారులు తమ షాపులు ఖాళీ చేయాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ శుక్రవారం హ్యాకర్లు రోడ్డెక్కారు. రోడ్డుపై ఉన్న తమకు న్యాయం చేయాలని నిరసన ప్రదర్శనలు,నినాదాలు నిర్వహించారు. ఇలా సుమారు 50 కుటుంబాల జీవనోపాధిని అడ్డుకోవడం సరైనది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం లోని వస్త్రలత మెయిన్ గేట్ వద్ద ఉన్న హాకర్స్ షాపులను తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులు తీరుకు నిరసనగా హకర్స్ ఆందోళన చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తమకు అండగా నిలవాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో హకర్స్ పోలవరపు శివ,పోలవరపు కనకలక్ష్మీ, సి.హెచ్. నాగరాజు, పి. ప్రసాద్, జి. శ్రీనివాస్, ఆశిష్ రాయ్ , అనిల్, షరీఫ్, పి. అంజమ్మ, పి. జానకి తదితరులు పాల్గొన్నారు.