తాడిపత్రి
తాడిపత్రి మండలతహశీల్దార్
కార్యాలయము దగ్గర
సిపిఐ రైతుసంఘము వ్వవసాయకార్మికసంఘము జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఎద్దులబండ్లతో ర్యాలీతో నిర్వహించి తదనంతరము సీపీఐ తాడిపత్రి నీయోజకవర్గ కార్యదర్శి టి.రంగయ్య ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ ,ఏపిరైతుసంఘము అద్యక్షులు డి.చిన్నప్పయాదవ్ ,హాజరుకావడముజరిగింది.
ఈసంధర్బంగా సీ.జాఫర్
మాట్లాడుతూ జిల్లాలో కరువు వలన నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకొని శాశ్వత కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఖరీఫ్ రబీ పంటలు కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందక అప్పుల పాలై దిక్కుతోచక గ్రామీణ ప్రాంతాల నుండి చిన్న సన్నకారు రైతులందరు నగర ప్రాంతాలకు వలసలు వెళ్లడం జరుగుతున్నది తక్షణమే ఆ వలసలను ప్రభుత్వము ఆపాలి పల్లె ప్రాంతాల్లోని ఉపాధి హామీ పనులు కల్పించాలి తక్షణమే పంట నష్టపరిహరం, పంటలు బీమా అందజేయాలి, కేవలం కరువు మండల గా ప్రకటించి చేతులు దులుపుకోవడం చాలా అన్యాయం జిల్లాకి కరువు కేంద్ర బృందం రావడం చుట్టము చూపుగా చూసి వెళ్లడం చాలా అన్యాయంవేల కోట్ల రూపాయల్లో పంటలు పెట్టి రైతుల నష్టపోతే పదులకోట్లలో కరువు నష్ట నివేదికలో తయారు చేయడం చాలా అన్యాయం ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్ర కరువు బృందం అధికారుల యంత్రాంగానికి సూచన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులుఎంత తీసుకున్నారో అంత మొత్తాన్ని పంట నష్టపరిహరము జమ చేయాలి, రైతుల తీసుకున్న రుణాలు అంటిని తక్షణమే రద్దు చేయాలి ,దుక్కి దున్ని సాగు చేసిన రైతులు కూడా గుర్తించి తక్షణమే వారికి కూడా పంట నష్టపరిహరము అందజేయాలి,ఆహరపంటలకు ఏకరాకు30వేలునష్టపరిహరము,వాణీజ్యపంటలకు ఏకరాకు60వేలు,ఉద్యానపంటలకు ఏకరాకు లక్షరూపాయలు కరువురైతులకుఅందించాలి,రైతులుతీసుకున్నపంటఋణాలు రద్దుచేయాలి ,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మద్యముపాలసీ పైవున్నద్యాస రైతులపై లేదు ఈచర్యను తీవ్రంగా ఖండిస్తున్నాముకరువుజిల్లాలో ,బిందు,తుంపెరసేద్యపరికరాలుఅటకెక్కించారు,ఉరవకోండ ప్రాంతములో 898.60కోట్ల రూపాయలతో 55వేల ఏకరాలలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ,నీర్వీర్యము చేయడము ఈప్రభుత్వానికి సిగ్గుగా లేదా,ఇప్పటికైనా
రైతులకుఅందించాలి,హంద్రీనివా నీటిసామర్థ్యము 5,500 వేలు క్యూసెక్కులనుండి 10వేల క్యూసెక్కులుపెంచుతామన్న హమీ CM మాటతప్పడము కాదా, ఇసుకపాలసీ అనుమతులు లేకున్నాఇసుక చారెడు అనుమతి ఉంటే బారెడు తోలడము భూగర్బజలాలు అడుగంటి నీటీసమస్యలు ఏర్పడుతాయి అని వ్యవసాయరంగనిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వము పట్టించుకోలేదు ఇటువంటి దౌర్బాగ్యపరిస్థితి నెలకోందిఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవాలని కేంద్రరాష్టప్రభుత్వాలకు సీపీఐ రైతు సంఘంవ్యవసాయకార్మికసంఘము ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం . ఈ కార్యక్రమంలో
సిపిఐ జిల్లా నాయకులు,వసంత్ బాబు,నాగప్ప,వ్యవసాయకార్మికసంఘము నీయోజకవర్గకార్యదర్శి రామాంజినేయిలు,నాగరంగయ్య,చింతాపురుషోత్తము,నారాయణరెడ్డి,రైతులుతదితరులు పాల్గొనడం జరిగినది.

