కడప సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలకు(బీరం సుబ్బారెడ్డి) లిజ్ సంబంధించి సీఈవో బహిర్గతం చేయాలని ఏఐటీయుసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కెసి.బాదుల్లా డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక హోచిమిన్ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు కళాశాల బ్యానర్ తగిలించే, తొలగించడం వెనుక ఏ మతలబు దాగి ఉందో బహిర్గతం చేయాలన్నారు.
సదరు జూనియర్ కళాశాల కోటిరెడ్డి సర్కిల్ పక్కనే ఓ అద్దె భవనం తీసుకొని ప్రచారం నిర్వహించుకుంటూ వస్తున్నదని తెలిపారు.
జిల్లా పరిషత్ పాలక మండలి ఆమోదం పొందినదా లేకపోతే బహిరంగ లీజు ప్రకటన ద్వారా కాంప్లెక్స్ ఎంత డబ్బులకు, ఎప్పుడు నుంచి కళాశాల నడుస్తుందో చెప్పాలన్నారు.
కాంప్లెక్స్ లీజ్ వెనకాల లక్షల రూపాయలు అధికార పార్టీ నాయకులకు ముట్టినదని జిల్లా పరిషత్ కార్యాలయంలోని అధికారులు చెవులు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పి.సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి లింగన్న లు పాల్గొన్నారు.