Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుజిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన కొత్త రవికుమార్

జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన కొత్త రవికుమార్

ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

పులివెందుల
జిల్లా ఆర్యవైశ్యసంఘ అధ్యక్షునిగా కొత్త రవి కుమా ర్, ప్రధాన కార్యదర్శిగా మిట్టా శ్రీహరి,కోశాధికారిగా కాంబోజి గంగాధర్ లు ఆదివారం పట్టణములోని రోటరీ పురం సమీపంలో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,మున్సిప ల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డిలు హాజరై వాసవి కన్య కా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిం చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికైన వారిని అభినందించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడు తూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పటికీ అందిస్తానని ఆయన అన్నారు. కొత్త రవికుమార్ చిన్నప్పటినుండి నన్ను ఆప్యాయంగా చూసుకునేవాడని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్య మంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్యవైశ్య నాయకుల అండదం డలు మాకు ఎప్పటికీ అందించాలని ఆయన ఆర్యవైశ్య సభ్యులను కోరారు. అంతకుముందుగా ఆర్యవైశ్య సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి ని దుశ్శా లవాలతో,పూలహారాలతో సత్కరించారు.ఈ కార్య క్రమంలో కౌన్సిలర్లు కోడి రమణ, జే సి యస్ ఇంచార్జ్,కౌన్సిలర్ పార్లపల్లి కిషోర్, లక్ష్మీ భార్గవి , గుల్జార్, కరుణాకర్, అయ్యప్ప శీను, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు, ఆర్యవైశ్య సంఘ జిల్లా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article