పులివెందుల టౌన్
జాతరను తలపించిన యాత్ర-2 సినిమా పులివెందుల పట్టణంలో మారుతి థియేటర్లో రిలీజ్ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ద్విచక్రవాహన ర్యాలీని వైకాపా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ వరకు వెళ్లి అక్కడ నుండి మారుతి థియేటర్ వరకు చేరుకుంది. థియేటర్ వద్ద వైకాపా నాయకులు బాణాసంచా పేలుస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కథాంశం ఆధారంగా చిత్రీకరించిన యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలను ఈ సినిమాలో ఆయనను ఎండ కట్టడం జరిగిందన్నారు. తండ్రి కోసం ఇచ్చిన మాటకోసం పోరాడిన కొడుకు కథ ఈ యాత్ర 2 సినిమ అన్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కళ్ళల్లో నీళ్లు తెప్పించాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, జగన్ మోహన్ రెడ్డి పాత్రలో జీవా జీవించారన్నారు. ముఖ్యంగా నేటి యువత ఈ సినిమా తప్పకుండా చూడాలన్నారు. ఈ సినిమాకి ఇప్పటికే విశేష స్పందన లభించింది అన్నారు. 11 గంటలకు వేసిన సోకు థియేటర్లో వైకాపా నాయకులు వీలలు, కేకలతో థియేటర్ దగ్గరలో పోయింది. జై జగన్ అంటూ వైయస్సార్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ముందుగా థియేటర్ ముందర , బ్యాండ్ వాయిద్యాల మధ్య జండాలు పట్టుకుని చిందులు వేస్తూ జై జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లపల్లి కిషోర్, చంద్రమౌళి, కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, డేనియల్ బాబు, శ్రీరాములు, నాగరాజు, పద్మనాభరెడ్డి, వీరారెడ్డి, సంపత్, ఫక్రుద్దీన్ తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.