టీడీపీ నేతలు డా. చప్పిడి, నులుకుర్తి , పిలుపు
కరప
కరప మండలం యండమూరులో శుక్రవారం జరగనున్న జయహో బిసి సదస్సు ని విజయవంతం చేయాలని డాక్టర్, చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు లు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం యండమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహ కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాజీ జెడ్పిటిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీల రక్షణకై చేపట్టిన జయహో బిసి కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా కరప మండలం పరిధిలో గల గ్రామాలన్నీ తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను గ్రామ ప్రజలను కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చప్పిడి,నులుకుర్తి మాట్లాడుతూ అత్యధిక శాతం ఓటు బ్యాంకు కలిగిన బీసీ సామాజిక వర్గాల ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి సంక్షేమం చేయకపోగా బీసీలను అణగదొక్కాలని చూస్తుందని పేరుకు బీసీలకు పదవులు కట్టబెట్టి కుర్చీల్లో కూర్చోబెట్టడం తప్ప బీసీల ఉన్నతి కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఓ ఎవరెవరు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకువచ్చి బీసీలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రజలు దీని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాల విజయం కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కడప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, కట్ట రంగారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.