పార్టీ కండువా కప్పిన నాగబాబు
గొల్లప్రోలు :గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన పట్టు రైతులు జనసేన పార్టీలో చేరారు . జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సమక్షంలో జనసేన కడువా కప్పుకున్నారు. చేబ్రోలు గ్రామంలో సుమారుగా 200 మంది పట్టు రైతులు రజిక చేనేత వడ్రంగి కులాలకు సంబంధించిన పలువురు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ ఉలవకాయల సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, తదితరులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వంగా గీత ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినప్పుడు మేమంతా కలిసి కష్టపడి పనిచేసే ఆమెను నెగ్గించుకున్నామని ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి సత్తిబాబు ఓరుగంటి శివగంగాధర్,బండి సత్య శంకర్ లోకా రెడ్డి బ్రదర్స్ ఓరుగంటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.