వెలమ కొత్తూరు లో మీ ఇంటికి మీ దివ్య
తుని
తుని మండలం వెలమ కొత్తూరు గ్రామంలో మాజీ తాండవ సుగర్స్ చెర్మన్ సుర్ల లోవరాజు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జన ప్రభంజనంతో సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల దివ్య హాజరయ్యారు
ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్ళిన దివ్య ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇంటి ఇంటికి వెళ్లిన జననేత్రి యనమల దివ్య కు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమని సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుంది అని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు
ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు యనమల శివరామ కృష్ణ, పోల్నాటి శేషగిరిరావు, మోత్కూరి వెంకటేష్, అప్పన రమేష్, జనసెన సమన్వయ కర్త చోడిశెట్టి గణేష్, చింతంనీడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ,జక్కాన రామనాయుడు, చిటికెల శ్రీనివాసరావు, దంతులూరి శ్రీనివాస్ రాజు,రాంబాబు రాజు, దిబ్బ శ్రీను,పృధ్వీ రాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు,బాబు, అంకరెడ్డి నాన అబ్బాయి,పలకా సోమేశ్వరరావు, గజ్జి రాంబాబు, కొల్లు సత్తిబాబు,స్థానిక నాయకులు తర్రా సత్యనారాయణ,తమరాన రామకృష్ణ, రోoగల అబ్బులు, కిల్లి శ్రీను, కర్రీ తాతలు,మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు