జగ్గంపేట
జగ్గంపేట ముంపుకు ప్రధాన కారణం అయిన వీరమ్మ చెరువు కాలువ డీ సిల్టింగ్ పనులు మరియు కల్వర్టు నిర్మాణం నిమిత్తం ఈరోజు జిల్లా ఆర్ డబ్ల్యు ఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చౌదరి కలెక్టర్ గారి ఆదేశానుసారం వీరమ్మ చెరువు కాలువను పరిశీలించి అంచనాలు రూపొందించారని జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్ తెలియజేసారు. మొన్న జరిగిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఈ కాలువ పనులు చేపట్టి జగ్గంపేట ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా గారిని వ్రాత పూర్వకంగా కోరడం జరిగిందని, దానికి స్పందనగా ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కాలువను పరిశీలించి అంచాలను తయారు చేస్తున్నారని తెలియజేసారు, సుమారు 20 లక్షలతో డీ సిల్టింగ్ పనులు, మారిశెట్టి వారి వీధి వద్ద ఒక కల్వర్టు నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలియజేసారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లో రాష్ట్ర స్థాయి నాయకులు ఒమ్మి రఘురామ్, ఆర్ డబ్ల్యు యస్ జె ఈ రాంజీ, పంచాయితీ కార్యదర్శి గణేష్ బాబు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సింధు తదితరులు పాల్గొన్నారు.