జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేటలో గ్రామీణ పారిశ్రామిక బందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఫ్ టియు జిల్లా కమిటీ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జగ్గంపేటలోని స్టాలిన్ భవన్ వద్ద నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 43 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు కోణాలుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కార్మికులకు యూనియన్లు కూడా ఉండకుండా చేసిందన్నారు.భవన నిర్మాణం కార్మికుల నిధులను పక్క దారి పట్టించి, కార్మికులకు సరైన సౌకర్యాలు లేకుండా చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు చూస్తున్నారన్నారు. రైతులకు నల్ల చట్టాలు అమలులోకి తీసుకొచ్చి,రైతు కూలీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం.ఏసు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు కే.లక్ష్మి, భగత్ సింగ్ నగర్ కాలనీ సభ్యులు ఈ వెంకటరమణ, వీర్రాజు, శేషగిరిరావు, గంగా,జ్యోతి, రాఘవరెడ్డి,వీరలక్ష్మి, అన్నపూర్ణ, సైకిల్ షాప్ కార్మికులు సురేష్, దుర్గా, కే బాబురావు, గోపి, కర్నాకుల రామలింగేశ్వర రావు, దుర్గారావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.