మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
పులివెందుల టౌన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు పులివెందుల నుంచి మొదలైందని ఎమ్మెల్యే అభ్యర్థి మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ( బీటెక్ రవి ) అన్నారు. సోమవారం పట్టణంలోని బుల్లా వీరప్ప వీధి, రెడ్డి గారి వీధి తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బీటెక్ రవితో అడిగేద్దాం కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి ఆయన సతీమణి లతా రెడ్డిలు టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి జనసేన ,టిడిపి మానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యలను మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనం పులివెందుల నుంచి మొదలైందని, రాష్ట్రంలోని ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారన్నారు. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని రాబోయే ఎన్నికలలో అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్టణ అధ్యక్షుడు అన్నా రెడ్డి ప్రసాద్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె వెంకటరామిరెడ్డి, ఆక్కుల గారి విజయకుమార్ రెడ్డి,జగన్, విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

