Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలు"జగన్ నినాదం" మా అభిమతం..!

“జగన్ నినాదం” మా అభిమతం..!

వరుస నంబర్ – 1.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు
చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తాం
వైసీపీలో చేరిన తిరుచానూరు టిడిపి సానుభూతి పరులు వెల్లడి
అండగా ఉంటాం.. ఆదరించండి..: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చంద్రగిరి:
మా అభిమతం “జగన్ నినాదం”.. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తిరుచానూరు టిడిపి సానుభూతి పరులు స్పష్టం చేశారు. తిరుచానూరు టిడిపి సానుభూతిపరులు 100 మందికి పైగా యువత సర్పంచ్ రామచంద్రా రెడ్డి ఆద్వర్యంలో వైసిపి కండువాలు కప్పుకున్నారు. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదంతో హోరెత్తించారు. ప్రతి ఒక్క యువతకు పార్టీ కండువా కప్పిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారిని స్వాగతించారు. అంతకుముందు వారు పుష్పగుచ్ఛం అందజేశారు.. దుశ్శాలువతో సత్కరించారు. బ్యాలెట్ లో వరుస నంబర్ – 1.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు వేయడంతో పాటు అందరికీ చెవిరెడ్డి కుటుంబం సేవ దృక్పథాన్ని తెలియజేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయిస్తామని స్పష్టం చేశారు. కరోనా, వరదల సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. ప్రజలు నమ్మి ఓటు వేసి ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసిన చెవిరెడ్డి కుటుంబం పట్ల ప్రజలు మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని వెల్లడించారు.
యువత భవితకు భరోసా
తిరుచానూరు నుండి టిడిపి సానుభూతి యువత వైసీపీకి మద్దతు పలుకుతూ పార్టీలో చేరడం శుభపరిణామం అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. వైసిపి సిద్ధాంతాలు నచ్చి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేవగుణాన్ని మెచ్చి, నా పట్ల ఎంతో విశ్వాసంతో పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్క యువతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. అండగా ఉంటామని.. ఆదరించాలని కోరారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని తెలియజేశారు. మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరువలేనని చెప్పారు. వైసీపీ కండువాలు కప్పుకున్న వారిలో.. మురళీ, శరత్ కుమార్, రాజేష్, చందు, కళ్యాణ్, సాయి, అఖిల్, తరుణ్, బాలాజీ, నరసింహా, రాజేష్, పవన్, వెంకటేష్, తులసి, ఉదయ్, హేమంత్, నాయక్, గణేష్, జానీ, నాగసాయి,వంశీ, అశోక్, బాలాజీ, యుగంధర్, సతీష్, విష్ణు, వెంకీ, నవీన్, మణి , ప్రేమ్, డిల్లీ, ఉదయ్, కుమార్, వెంకటేష్, భానుప్రకాష్, వాసు, నాగ, సునీల్, మధు, భాస్కర్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు సునీల్, లోకేష్, హరి, శర్వణ, సూరి, మునికృష్ణ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article