వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల :జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం, వైయస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించడమేలక్ష్యమని మున్సిపల్ వైకాపా ఇన్చార్జి వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చిన్నప్ప, జెసిఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్ ,చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి డేని యల్ బాబులు అన్నారు. సోమవారం పట్టణంలోని రాజారెడ్డి కాలనీ, సరస్వతి విద్యా మందిరం, నగరి గుట్ట తదితర ప్రాంతాలలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప కు వెళ్లి ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి తెలియచేసి , వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డి ని భారీ మెజార్టీతో ఫ్యాన్ గుర్తు పై ఓట్లువేసివేయించిగెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకా లే మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రి చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వం వైపే మళ్లీచూస్తున్నా రన్నారు. జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడిన రాష్ట్ర ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు కోడి రమణ, లక్ష్మీ భార్గవి, గుల్జార్, కో ఆప్షన్ మెం బర్ దాసరి చంద్రమౌళి,బండల మురళి, బాల అశ్వత్ రెడ్డి, సూరి, ఆది, శ్రీరాములు ,ప్రశాంత్, వైకాపా నాయకులు పద్మనాభరెడ్డి, వీరారెడ్డి, మధు సూదన్ రెడ్డి, ఓబులేసు, మస్తాన్ వల్లి, తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.