పోరుమామిళ్ల:2024 సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి, పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లి గ్రామంలోనూ పోరుమామిళ్ల 18 వ వార్డు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, అడ్వైజర్ పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మండల ఉపాధ్యక్షులు సి. భాష, రంగసముద్రం సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు. లక్కీ నేను ఓబయ్య. శివయ్య. పేట సుబ్బయ్య. తోట ప్రసాద్. కె గురు ప్రసాద్. పీరయ్య. రాళ్లపల్లి నరసింహులు. ఎంపీటీసీ ఇసాక్. సీతారాం రెడ్డి. రామిరెడ్డి. సరే ప్రసాద్. ఎంపీటీసీ గుర్రప్ప. కృష్ణారెడ్డి విద్యా కమిటీ ప్రెసిడెంట్ గురప్ప మరియు వైసీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం జరిగిందని మళ్లీ ఇప్పుడు అవే సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని చెప్పడం జరిగిందని చంద్రబాబు చేసిన కుట్ర వల్లే అవ్వ తాతల పెన్షన్లు కు బ్రేక్ పటం జరిగిందని గతంలో మాదిరిగా కాకుండా వాళ్ళ ఆఫీసు జుట్టు బ్యాంకులు చుట్టూ తిరుగుతూ వృద్ధులు మరణించడం జరిగిందని దీనంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు అని అన్నారు. వచ్చే 13 వ తారీకున ప్రతి ఒక్కరు కూడా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మనందరిపై ఉన్నదని అప్పుడే అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చంద్రబాబు 2014 నుండి 2019 వరకు 66 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఇప్పుడు మళ్లీ ఆరు హామీలను ప్రజలను మోసం చేసే దానికి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలు ఎవరు నమ్మి మోసపోవద్దని అన్నారు.