ఇంద్రకీలాద్రి, విజయవాడ.
సనాతన ధర్మ ప్రచారం, లలిత కళలకు ప్రోత్సాహం అందించేందుకు గానూ సకల కళలకు ఆరాధ్యదేవతయైన ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నూతన రాజగోపురం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం 6.30 నుండి కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన నృత్య విద్యార్థులు భక్తి శ్రద్దలతో శ్రీ కనకదుర్గ అమ్మవారికి నృత్య కళార్చన నిర్వహించారు.నృత్యగురువు మునిపల్లి మహతి ఆధ్వర్యంలో నృత్య విద్యార్థులు తమ ప్రదర్శనలో భాగంగా పలు భక్తి కీర్తనలకు 19మంది లయబద్దంగా నృత్య ప్రదర్శన చేశారు.ప్రదర్శన అనంతరం కళా బృందానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి,ప్రసాదములు అందజేయడమైనది.