Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలుజగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం

జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం

జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షం

ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే సీఎం లక్ష్యం

రైతు భరోసా కేంద్రం,వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎంపీ

పులివెందుల
జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని,
జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందుతున్నా యని, నవరత్న పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పని చేస్తున్నదని కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందు ల నియోజకవర్గ లింగాల మండలం పార్నపల్లి, వెలిదండ్ల గ్రామంలో నూతనంగా నిర్వహించిన గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం,వైయస్సా ర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎంపీ అవినాష్ రెడ్డి , వైయస్ అభిషేక్ రెడ్డి, నాయకులతో కలిసిరిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . అక్కడికివచ్చిన గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధించిన అధికారుల తో వెంటనే శరవాణి ద్వారా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరింపజేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు జగనన్న ప్రభుత్వసంక్షేమ పథకాలు అందిస్తున్నా యన్నారు, ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి తరహాలోఉచిత వైద్యం అందించడమే ముఖ్యమం త్రి జగన్మోహన్ రెడ్డి లక్షమన్నారు. అర్హత ఉన్న ప్రతివారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా అందుతున్న అన్నారు. జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటినీ అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను విని వారి ఇచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిం ప చేస్తామన్నారు. పులివెందుల ప్రాంతం సస్యశ్యా మలంగా ఉందంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కాలువల తవ్వించి కాలువ ద్వారా వంకలకు చెరువులకు నీరు ఈరోజు నింపుతున్నారంటే దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవే అన్నారు. పార్నపల్లి డ్యాం లో సమృద్ధిగా నిరున్నందున బోర్లలో , బావులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయ న్నారు. టిడిపి నాయకులు లేనిపోని అబద్ధపు మాటలను చెబుతున్నారని వాటిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు గడబడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం మళ్లీ అందుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా రాష్ట్ర ప్రజలు జగన్ వైపే చూస్తున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో పాడా ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి, లింగాల మండల నాయకులు కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article