శ్రీ సత్య సాయి జిల్లా
వచ్చే ఎన్నికలలో జగనన్నపల్లికి మోసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర మహిళా శిశు శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పరిధిలో పెనుగొండ మండలంలోని పలు గ్రామాలలో ఆమె ఆదివారం పర్యటించి పలు బహిరంగ సభలలో ప్రసంగించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజల పల్లకి మోసారని ఇప్పుడు ఆయన పల్ల కి మనం మోసి ఆయన రుణం తీర్చుకోవాలని అమె కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలన్నదే ఆయన ఆశయం అన్నారు. గతంలో అధికారం కోల్పోయిన తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలతో జతకట్టడం చేస్తున్నదన్నారు జగనన్న ప్రజలతో జతకట్టి ఓటర్లనే స్టార్ క్యాంపెయిన్ లాగా చేశారన్నారు. మన నమ్మకం జగనన్నేనని ఆమె ఉ ద్షటించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రాక్షస పాలన కొనసాగించాలని చూస్తున్నది అన్నారు . సువిచ్చ పాలన కావాలో అరాచకపాలన కావాలో మీరే ఆలోచించాలన్నారు.
అడుగడుగున నీరాజనాలు
రాష్ట్ర మంత్రి ఉషశ్రీఆదివారం పెనుకొండ మండలంలోని హరిపురం కు రుబవాండ్లపల్లి మోటారుపల్లి చిన్నపరెడ్డిపల్లి గుట్టూరు మక్కాజి పల్లి చంద్రగిరి వెంకటగిరి పాలెం దుద్దేబండ గొల్లపల్లి గొందిపల్లి గ్రామాలలో అమె విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో ఆమెకు పల్లె పల్లెనా ప్రజలు అఖండ స్వాగతం పలికారు మహిళలు మంగళారతులు పట్టారు యువకులు చిందులు తొక్కారు కార్యక్రమాలలో జడ్పిటిసి శ్రీరాములు ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ నాగమూర్తి దుద్దేబండ సర్పంచ్ గౌతమి సింగల్ విండో అధ్యక్షులు సల్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వెంకటగిరి పాలెం సర్పంచ్ లక్ష్మి వైసిపి నాయకులు శ్రీకాంత్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల కన్వీనర్ బాబు వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.