లేపాక్షి: మండల పరిధిలోని చోళ సముద్రం చౌడేశ్వరి దేవి ఆలయంలో హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయశాంతమ్మ, హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వారంలో చౌడేశ్వరి దేవికి పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామానందన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బోయ శాంతమ్మతో పాటు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజలు చౌడేశ్వరి దేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన బోయ శాంతమ్మ, ఇంద్రజలకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, గాజులు ,చీర, తీర్థప్రసాదాలను రమానందన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చౌడేశ్వరి దేవాలయ ధర్మకర్త ఎన్ఆర్ఐ కేశవమూర్తి, గ్రామ పెద్దలు రంగనాయకులు, వైకాపా జిల్లా యువజన సంఘం అధ్యక్షులు లోకేష్, నాయకులు చెన్న కృష్ణ, జయచంద్ర, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.