చైనాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కారణంగా ఢిల్లీలో భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రానికి భూమికి అడుగు భాగంలో 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం కారణంగా సోమవారం రాత్రి 11.39 గంటల సమయంలో ఢిల్లీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది.