Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుచేతి వృత్తుల కళాకారులకు బీజేపీ కార్యాలయంలో ఉచితంగాకుట్టు మిషన్లు …సోలార్ రూప్ టాప్ కరెంట్ …

చేతి వృత్తుల కళాకారులకు బీజేపీ కార్యాలయంలో ఉచితంగాకుట్టు మిషన్లు …సోలార్ రూప్ టాప్ కరెంట్ …

గాజువాక:
గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ డా. కరణంరెడ్డి నరసింగరావు (KNR) ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా టైలరింగ్ చేసి వారికి ఉచితంగా కుట్టుమిషన్లు కోసం, మంగలి, కుమ్మరి, అల్లికలు అలా 18 రకాల చేతి వృత్తుల కళాకారులకు బీజేపీ కార్యాలయంలో ఉచితంగా నమోదు చేసుకొనే ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే పీఎం సర్యాఘర్-ప్రధాని మంత్రి సోలార్ రూఫ్ టాప్ పవర్ కూడా ఉచితంగా నమోదు చేసే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు లబ్దిదారులు కింది వివరాలతో బీజేపీ కార్యాలయంకు వస్తే ఉచితంగా నమోదు చేసి రసీదు ఇవ్వడం జరుగుతుందన తెలిపారు.సోమవారం నుండి శనివారం వరకు రోజు ఉ..9.30 నుండి సాయంత్రం 7 వరకు నమోదు చేస్తారు.
కావల్సిన పత్రాలు..పీఎం విశ్వకర్మ పథకం..1. భార్య భర్తల ఆధార్ 2).ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్3.బ్యాంక్ వివరాలు.(Ac no.,Ifsccode)4.ఇది వరకు వ్యాపార వివరాలు, ప్రధాని మంత్రి సోలార్ రూఫ్ టాప్ పవర్.పథకానికి ఆధార్, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు.(Ac no., Ifsc code),కరెంట్ మీటర్ నంబర్. (కరెంట్ బిల్ కూడా), ఈమెయిల్ ఐడి తెస్తే నమోదు చేయడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article