.బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బాలు దొర.
ప్రజా భూమి ఏలేశ్వరం
కాకినాడ జిల్లా , ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరం లో టౌన్ బీజేపీ అధ్యక్షుడు గట్టిం వెంకట రమణ ఆధ్వర్యం లో ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన పథకం అవగాహన సదస్సు టౌన్ ఉపాధ్యక్షులు రెడ్డి లోవరాజు గృహం వద్ద నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీజేపీ ప్రత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ గంటా బాలు దొర పాల్గొని మాట్లాడుతూ 18 సం. రాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని తెలిపారు. చేరువలో వున్న సి యస్ సి సెంటర్ లో పేరును నమోదు చేసుకోవాలని , వివిధ రకాల చేతి పని వారు,కుల వృత్తులు వారు అర్హులని తెలిపారు. 5 శాతం అతి తక్కువ వడ్డీతో లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం పొంది 18 నెలల్లో ఈ ఋణాన్ని తిరిగి చెల్లించాలని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్ తెలిపారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా బీజేపీ ప్రజలకు చేరువ అవుతుందని బీజేపీ టౌన్ అధ్యక్షులు గట్టిం వెంకట రమణ అన్నారు. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కో కన్వీనర్ దాకే కృష్ణారావు, టౌన్ ఉపాధ్యక్షులు రెడ్డి లోవ రాజు,మాజీ సైనికోద్యోగుల సెల్ జిల్లా కన్వీనర్ కర్రి ధర్మరాజు,రెడ్డి వరలక్ష్మి, రాతికింది కృష్ణారావు,గొల్లపల్లి త్రినాధ్,యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గట్టిం సీతారాం,గునిసెట్టి శ్రీనివాస్,కొప్పుల రాంబాబు ,మలిరెడ్డి పాపరాజు,వాడపల్లి చినబాబు,విస్తారక్ యార్లగడ్డ వెంకట రాయుడు తదితరులు పాల్గొన్నారు