చంద్రగిరి :చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 395 పాఠశాలల్లో 23150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, రైటింగ్ ప్యాడ్స్, బ్రెయిన్ ఎక్సర్ సైజ్ ఫజిల్ షీట్ లను చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ ఉచితంగా పంపిణీ చేశారు.సోమవారం ఉదయం చంద్రగిరి మండలం పనపాకం పంచాయతిలోని పాకాలవారిపల్లె,రవణప్పగారి పల్లె,అరిగిలవారిపల్లె, పనపాకం పేట,తూర్పపల్లె,ప్రాధమిక పాఠశాలలు,పనపాకం హైస్కూల్ లో బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న స్ఫూర్తి,ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,తుడా చైర్మన్,వైఎస్సార్ సిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ల ఆశీస్సులతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గం మొత్తం పాఠశాలలలోని విద్యార్థులకు అందజేస్తామని అన్నారు.విద్యార్థులు బాగా చదువుకొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.సంపూర్ణ అక్షరాస్యత జగనన్న లక్ష్యం అన్నారు.నాడు – నేడు పథకం కింద మోడర్న్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలలు un రూపుదిద్దుకున్నాయన్నారు ఆమె.
జగనన్న ముందు చూపుతో విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా ఆంద్రప్రదేశ్ ఉందన్నారు.
జగనన్న స్ఫూర్తితోనే ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెవిరెడ్డి లక్ష్మీ అన్నారు.జగనన్న స్ఫూర్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆశీస్సులతో పిల్లలు అందరూ బాగా చదవాలని కోరుతున్నాఅన్నారు.ఈకార్యక్రమంలో యంపిపి హేమేంద్రకుమార్ రెడ్డి, వైస్ యంపిపి,వెంకటరత్నం, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొటాలచంద్రశేఖరెడ్డి,మట్టా మధు,డివిజన్ పార్టీ అధ్యక్షులు అగరాల దేవారెడ్డి,వరలక్ష్మీ,పనపాకం పంచాయతి అధ్యక్షులు పానేటిచెంగల్రాయులు,నాయకులుమస్తాన్,సిహెచ్ రెడ్డెప్ప, పి.చంద్రశేఖర్ రెడ్డి, పసలనాగరాజు, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, అమాస నాగేశ్వరరావు,కసా గోపాల్, నాగభూషణం,యంపిడిఓ సూర్య సాయి,యంఇఓలు,లలికుమారి, భాస్కర్ బాబు,పనపాకం హైస్కూలు హెచ్ యం పురుషోత్తంరెడ్డి,సచివాలయం కార్యదర్శి శిరీష, విద్యార్థులతల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.