హిందూపురం టౌన్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో జరిగిన అమరవీరుల వీరగాథ చిత్రలేఖన పోటీల్లో సిరి చందనకు ప్రథమ బహుమతి వచ్చింది జిల్లాస్థాయి సంబంధిత చిత్రలేఖన పోటీల్లో బాల యేసు విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న సిరి చందన తన నైపుణ్యంతో ఉత్తమ చిత్రం గీయడంతో ఆమెకు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ మేరకు ఆ విద్యార్థిని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి చేతుల మీదుగా మెమొంటో ప్రశంసా పత్రాన్ని అందుకుంది పాఠశాలకు చెందిన విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో బహుమతి సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు

