కనిగిరిలో ఎంపీ అభ్యర్థికి మంచి మెజార్టీ తెప్పిద్దాం. జిల్లా అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డి….
కనిగిరి:2019 లో అధికారంలోకి వచ్చిన జగనన్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి వికలాంగులు,ముసలి వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇంటికి వచ్చేలా చేశారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవ ఎవరు మరువలేనిది. సచివాలయ వ్యవస్థతో మండల స్థాయిలో జరిగే పనులు గ్రామస్థాయికి తీసుకువచ్చారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు చేశారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్యం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేద,మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేశారు.ఇళ్ల స్థలాలు,ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు,పంట నష్టం,ఆరోగ్యశ్రీ, నాడు నేడు తో స్కూల్ల అభివృద్ధి ఇలా ఎంతో మేలు చేశారు. 2024 ఎన్నికల్లో చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కనిగిరి ఎమ్మెల్యేగా దద్దాల నారాయణ యాదవ్ ను గెలిపిద్దాం ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కనిగిరిలో మంచి మెజారిటీ తెప్పిద్దాం.
జగనన్నను ముఖ్యమంత్రిని చేద్దాం.