టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ప్రేక్షకుల్ని నవ్వించడానికి ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111′ గావస్తున్నట్లు ఉంది.’చారి 111’ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా ‘చారి’ పాత్రలో వెన్నెల కిశోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.