- ఎంపిడిఓ దివిజ సంపతి
వేంపల్లె :మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపిడిఓ దివిజ సంపతి ఆదేశించారు. సోమవారం ఆమె టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయా గ్రామాల సచివాలయ కార్యదర్శులు, సర్పంచులతో మాట్లాడారు. ప్రస్తుతం వేసవి రీత్యా మండుతున్న ఎండలు విపరీతంగా పెరిగాయని, దీంతో ప్రజలు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు.