కదిరి :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని కదిరి అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి యశోద దేవి జోస్యం చెప్పారు. 11వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె పట్టణంలోని 24వ వార్డులో ప్రతిఇంటి తలుపు తడుతూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును అభ్యర్థించారు. ఆమె ఓటర్లను అప్యాంగ పలకరిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ, మినీ మేనిఫెస్టోలోని ఆరు అంశాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కందికుంట ప్రసాద్ ను గెలిపిస్తే కదిరి నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆల్ఫా ముస్తఫా, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, రొద్దం బషీర్, భాస్కర, షేక్ బాబ్జాన్, సీ.ఏ ఫారూఖ్, సలాం బీడీ ఇస్మాయిల్, ఖాదర్ బాషా, ముఖ్తదీర్, గౌసీ, బాబావాలి, కబీర్, దాదాపిర్, అమీన్, ఆరిఫ్, అహమ్మద్ అలీ, కటిక ఖాదర్ బాషా, నాసిర్ అలీ, కాటం మనోజ్, రాఘవ, గోపురం శీన, ఐటీడీపీ జె.ఎస్.మన్సూర్, జునైద్, మహిళ నాయకులు పర్వీన్ బాను, పీట్ల, రమణమ్మ, గంగరత్నమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.