ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇసుక కేసులోనూ బాబు వేసిన బెయిల్ పిటిషన్ విచారణ కూడా ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ ఆదేశించింది.