Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుచంద్రగిరి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా షేక్ మస్తాన్..!

చంద్రగిరి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా షేక్ మస్తాన్..!

ఎమ్మెల్యే చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన మస్తాన్

చంద్రగిరి:
చంద్రగిరి మండలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా చంద్రగిరి పట్టణంకు చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ మస్తాన్ ను నియమించారు. ఈమేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ వర్గానికి చెందిన మస్తాన్ ను మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించడం పట్ల పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన షేక్ మస్తాన్ ఆదివారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన తనకు మండలపార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై మరింత బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ పురోభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానికి కష్టపడి పనిచేస్తానని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article