ప్రజా భూమి,చంద్రగిరి:
భారతీయ జనతా పార్టీ చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యనాయకులతో చంద్రగిరి ఢిల్లీ హోటల్ నందు శనివారం ఎస్. మునిగి రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా బిజెపి చిత్తూరుజిల్లాఅధ్యక్షులుయస్.జగదీశ్వర్ నాయుడుపాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన 193 పథకాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లి, ప్రతి ఒక్క పోలింగ్ బూత్ స్థాయి వరకు తెలియజేయాలని కోరారు. అలాగే సంస్థాగతంగా మండల కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మండల అధ్యక్షుడుగా శంకర్ రెడ్డిని, పాకాల మండల అధ్యక్షులుగా బ్రహ్మంను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కే. వెంకటముని,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. సుబ్రమణ్యం యాదవ్, గాలి పుష్పలత, ఖాయం హరినాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు, బిజెపి నాయకులు టి. మధు బాబు, దీనదయల్ నాయుడు, తిలక్ యాదవ్,మున్నయ్య, లక్ష్మి దేవి,వెంకటాద్రి ,దొరస్వామి, నరేష్ నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.