Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుచంద్రగిరి తలరాతను మార్చి చూపిస్తా

చంద్రగిరి తలరాతను మార్చి చూపిస్తా

6 మండలాల్లో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..!

యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

_ మీడియా సమావేశంలో పులివర్తి నాని వెల్లడి
చంద్రగిరి:
ఒక్క అవకాశం ఇస్తే 25 ఏళ్లుగా వెనుకబడిన చంద్రగిరి తలరాతను మారుస్తానని, కుటుంబ పాలనకు అవకాశం ఇవ్వనని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. గురువారం తిరుపతి రూరల్ మండలంలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 మండలాల్లోని 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు.
చంద్రగిరి మండలంలో మినీ ఐటి పార్క్ నెలకొల్పి 2,500 మందికి ప్రత్యక్షంగా, 3,500 మందికి పరోక్షంగా ఉపాధి… తిరుపతి రూరల్ మండలంలో మెడికల్, లైఫ్ సైన్సెస్ (ఆర్&డి) క్లస్టర్ తీసుకువచ్చి అధునాతన కారిడార్ నిర్మాణం, 1000 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి… రామచంద్రాపురం మండలంలో మెడికల్ పరికరాల (ఇన్స్ట్రుమెంట్స్) తయారీ, వాటి అనుబంధ రంగాల పరిశ్రమను నెలకొల్పి 500 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి…
పాకాల మండలంలో గార్మెంట్ పరిశ్రమను నెలకొల్పి 500 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి… చిన్నగొట్టిగల్లు మండలంలో పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి 200 మందికి ప్రత్యక్షంగా, 300 మందికి పరోక్షంగా ఉపాధి… యర్రావారిపాళం మండలంలో తిరుచానూరు, తిరుమల, తలకోన( TTT) లను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజ్ తీసుకొచ్చి, ఎకో థీమ్ పార్కుల నిర్మాణం, 500 మందికి ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా ఉపాధి అంశాలను మేనిఫెస్టో లో పొందుపరిచామన్నారు. అలాగే 10వ తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు సరైన మార్గ నిర్దేశక తరగతులు నిర్వహించి, సన్మార్గంలో నడిపేందుకు తోడ్పాటును అందిస్తామన్నారు. యూత్ కాంప్లెక్స్ నిర్మించి కంప్యూటర్ సెంటర్, స్టడీ స్పేస్, లైబ్రరీ, ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సముదాయాల నిర్మాణం, స్విమ్మింగ్, జిమ్ నిర్మించి యువతకు ఉచిత సభ్యత్వం కల్పిస్తామన్నారు.
గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాన్ని 25సం’ వెనక్కి నెట్టారని ఆరోపించారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే కుటుంబ పాలన నడుస్తుందని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే కొన్ని వాగ్దానాలు చేశానని దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1900 వాలంటీర్లను ఎమ్మెల్యే రాజీనామా చేయించారు. ఎలక్షన్ లో డబ్బులు పంపిణీ కోసం, ఏజెంట్ లుగా వారిని వాడుకుంటున్నారు. చంద్రబాబు 10వేల జీతం ఇస్తామని చెప్పడంతో వాళ్లను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు.
2019 నుంచి 2024 వరకు ఒక ఇండస్ట్రీ, ఒక్క ఉద్యోగం రాలేదని విమర్శించారు. యువతను గంజాయి కి బానిసలు చేసి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గర 15 సంవత్సరం జెండా మోసిన నాయకులు ఒక్కరు లేరని, వెంట ఉండే నాయకులను కూడా ఎమ్మెల్యే ను నమ్మడం లేదన్నారు.. వారికి ఆయన స్వభావం అర్థమైందిమని తెలిపారు. యువతను మోసం చేసి లబ్ది పొందింది చెవిరెడ్డే నని మరోసారి స్పష్టం చేశారు. యువత పేరుతో మఠం భూముల్లో క్రికెట్ నిర్వహించి భూములు కబ్జా చేశారని వెల్లడించారు. 90 శాతం కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసిన ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, వలపల దశరథ నాయుడు, శ్రీథర్ వర్మ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article