Wednesday, September 17, 2025

Creating liberating content

తాజా వార్తలుచంద్రగిరిలో వైసీపీ కంచుకోటకు బీటలు..!

చంద్రగిరిలో వైసీపీ కంచుకోటకు బీటలు..!

-టీడీపీ తీర్థం పుచ్చుకున్న 100 మంది వైకాపా నాయకులు..
-కష్ట కాలంలో పార్టీకి అండగా ఉంటున్న ఎవ్వరిని మర్చిపోను
.. పులివర్తి నాని..

చంద్రగిరి:చంద్రగిరిలో వైసీపీ కంచుకోటకు బీటలు వాలాయి. అగరాల, ఐతేపల్లి, పులిత్తివారిపల్లి, ఎజీ పల్లెలకు సుమారు 100 మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆగరాలలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, జనసేన ఇన్చార్జ్ దేవర మనోహర్, బిజెపి ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ యువత అధ్యక్షుడు అల్తాఫ్ ఆధ్వర్యంలో యువత అతిథులను భారీ గజమాజలతో సత్కరించారు.అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ గతంలో పార్టీలకు అతీతంగా అగరాల వైసీపీ నాయకుల స్థల వివాదంలో తెలుగుదేశం పార్టీ సహాయం చేసిన అంశాన్ని గుర్తు చేశారు.కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరికీ సహాయం చేయడం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్దాంతమని పేర్కొన్నారు. ఆయన నేర్పిన క్రమశిక్షణతో పార్టీ నేతలు కార్యకర్తలు ముందుకుపోతున్నారని వెల్లడించారు. అగరాలలో కొన్ని అరాచక శక్తులు తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని కూడా అడ్డుకోవాలని చూడడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూలింగ్ లేదని, రెండవ సారి గెలిచిన తర్వాత కనిపించకుండా పోయారని ఆరోపించారు. నిజంగా చంద్రగిరి అభివృద్ధి పై కాస్తంత మమకారం ఉన్న సీఎం జగన్ కు ఆత్మీయుడు కావడంతో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి ఉండవఛ్చన్నారు. అలా కాకుండా సహజ సంపదను మొత్తం దోచేసి ఒంగోలుకు మకాం మార్చాడని దుయ్యబట్టారు. ఆయన గురువులు అని చెప్పుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలో నుంచి పంపించేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నేనుఏ ఒక్క అవినీతికి పాల్పడినా టవర్ క్లాక్ దగ్గర ప్రశ్నించవచ్చన్నారు. కార్యకర్తలను, ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానన్నారు. చంద్రబాబు కల, నా కోరిక కోటపై జెండా ఎగురవేయడమే నని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన 50 పడకల హాస్పిటల్ తప్ప అభివృద్ధి పనులు ఏం జరగలేదని ఆరోపించారు. అండర్ డ్రైనేజ్ లేదు. మంగాపురం రోడ్డు వెడల్పు చేయలేదు, బస్టాండ్ లేదు. మేజర్ పంచాయతీలో స్మశాన వాటిక లేదని మండిపడ్డారు. అగరాలలో కొందరు ముస్లింలకు ఇళ్లు ఇవ్వలేదన్నారు. మినీ షాదీమహల్ నిర్మిస్తానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటున్న ఎవ్వరిని మరచిపోనని వెల్లడించారు. గత వారం నుంచి ఎమ్మెల్యే కుల, మత వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ట్రాప్ లో పడ్డొదని హితవు పలికారు.
వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాయకులు…
అగరాల పంచాయతీకి చెందిన ఏ. మణికంఠ, ప్రేమ్ కుమార్, జస్వంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమేష్, యశ్వంత్ రెడ్డి, రవి, రవిచంద్ర రెడ్డి, నాగభూషణం, సుబ్బు, కిరణ్ కుమార్, ఇఫ్రాన్, బాలు, అబ్దుల్, ఇమ్రాన్, సురేష్, బాలాజీ, మస్తాన్, గణేష్, రాజేష్, కార్తీక్, రాజు, చంగల్ రాయులు, ఎర్రయ్య, చాంద్ బాషా, సైఫుల్ల, భవి, మంజు, లక్ష్మి, అమ్ములు అలాగే ఐతేపల్లి పంచాయతీకి చెందిన డి.గిరి, ప్రసాద్, రంజిత్, గణేష్, వంశీ, మోహన్, సూరి, సన్నీ, జగదీష్, రాజేష్, పురంధర్ యాదవ్ అలాగే ఎ.జీ. పల్లి పంచాయతీకి చెందిన శివ మునికృష్ణ, మునిరత్నం, ధనంజయులు, వెంకటముని, సుబ్రమణ్యం అలాగే పులిత్తివారి పల్లి పంచాయతీ కి చెందిన సురేష్, రాజేష్, గోపి, జగదీష్, లోకేష్, ఉదయ్ శంకర్, శీను, సుబ్బు, శశి, ముత్తు, కోటి, అరవింద్, మోహన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article