గాజువాక: గాజువాక జంక్షన్ లో వై ఎస్ ఆర్ సి పి జెండా ఆవిష్కరించిన ఉరుకూటి రామచంద్రరావు ( చందు )వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. గాజువాకలో అంగరంగ వైభవంగా జరిగాయి. వైసీపీ ఆవిర్భవించి13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా గాజువాకలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి.

కార్యక్రమంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి ఉరుకూటి రామచంద్రరావు (చందు) స్వర్గీయ వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైసిపి నేతలతో కలిపి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అని చెప్పారు.వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన నాయకుడు ఎవరూ లేరని చందు అన్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు,వైసిపి జిల్లా వైస్ ప్రెసిడెంట్ దామా సుబ్బారావు,66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్,మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు,జేసియస్ క్లస్టర్ ఇన్చార్జ్ రెడ్డి జగన్నాధం,షౌకత్ ఆలీ,పాలఘాట్ కృష్ణ,యలమంచిలి అప్పారావు,కర్రి ప్రసాద్,పెదిరెడ్ల ఈశ్వరరావు,పేరం రామకృష్ణ రెడ్డి,సండ్రాన నూకరాజు,బొత్స వాసు,నీలాతి అచ్చిబాబు,బాబులు నాయుడు,రంగాల పైడిరాజు, సింగంపల్లి దేవుడు, బలిరెడ్డి పెంటారావు, జియస్యన్ రాజు, కుప్పిలి సత్యనారాయణ, రెహ్మాన్, రబ్బాని, చట్టి తాతారావు, చట్టి అప్పలరాజు, సుబ్బారెడ్డి, సీర చిన్నారావు, మొల్లి ఆనంద్, డేవిడ్ కింగ్ యాదవ్, ఉరకూటి సింహాద్రి, శివ గణేష్, చందక గోపి, కటికల కల్పన, ఉమాదేవి, నిర్మల రెడ్డి, విమలా థామస్, గొంతిన సత్యవతి, శాంతి, సంతోషి, దీప్తి, రాములమ్మ, వాణి, దాసరి సత్యవేణి, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
