జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్
జీలుగుమిల్లి :కేంద్రంలో బిజెపి మరోసారి అధికారం చేపట్టాలని రాష్ట్రంలో కూడా బిజెపి అధికారం లోనికి రావాలని బిజెపి జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ అన్నారు.
జీలుగుమిల్లి మండల కేంద్రం లో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన ఇంటి ఆవరణలో ఘనంగా గా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్దాంతాలు ప్రజలకు ఎంతో సంతృప్తి కరంగా ఉన్నాయని అన్నారు. మోదీ పాలన లో గ్రమా స్థాయి నిధులు మంజూరు చేయడం తో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రజలు ఆనందంగా ఉంటున్నారని,కేంద్రం లో బిజెపి మరోసారి రాష్ట్రం లో ఒకసారి బిజెపి అధికారం లోకి వస్తె మరింత అభివృద్ది కి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గుడ్ల రాంబాబు,కేసుబోయిన బాబి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.