విద్యార్థులకు క్రీడల పై మరింత ప్రోత్సాహం అందిస్తాం
పులివెందుల :జేఎన్టీయూ కళాశాలలోని విద్యార్థులకు క్రీడల పై మరింత ప్రోత్సాహం అందిస్తామని జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ జి.వి.ఆర్. శ్రీనివాసరావు అన్నారు సోమవారం జేఎన్టీయూ కళాశాలలో కాలేజ్ డే, క్రీడా దినోత్సవం వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ జి.వి.ఆర్. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభకు అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ పులివెందులలో క్రీడా రంగాన్ని అభివృద్ధి పరుచు టకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు క్రీడల పై మరింత ప్రోత్సాహం అంది స్తామన్నారు. విద్య ,ఆరోగ్యం, వృత్తి పై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రీడలు ఎంతో అవసరం అని సూచించారు.జీవితంలో ఎదగడాని కి చదువే కాకుండా ఆటపాటలను కూడా భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, ఆ ప్రతిభకు కృషి తోడైతే సాధించలేనిది ఏదీ లేదన్నారు. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకొనుటకు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సి పాల్ ప్రొఫెసర్ ఆర్.రమణారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా పట్టుదల,కార్యసిద్ధి మెరుగుపడి ఒత్తిడిని జయించవచ్చునన్నారు.ఎందరో క్రీడాకా రులు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సాంకేతి క సహకారం లేని రోజుల్లో దేశ ప్రతిష్టను నిలబెట్టా రని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడా కారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. ఫిజిక ల్ ఎడ్యుకేషన్ ఇంచార్జ్ డాక్టర్ ఏ.దామోదర రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కోరా రు.ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో గెలుపొంది న విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.