Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం 30 వ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం 30 వ ఆవిర్భావ వేడుకలు

ఏలేశ్వరం:- అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం 30 వ ఆవూరి బావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శిబాబు, సిపిఎంఎల్ వర్షం రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్యాల రత్నం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కంపూడి రాజు, గిరిజన సంఘం కార్యదర్శి భాషా రాజమణి, సంఘం మండల కమిటీ సభ్యురాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ రావు మాట్లాడుతూ అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు కావస్తుందని ఈ 30 సంవత్సరాల లో అనేకమైన పోరాటాలు నిర్వహించిందని, మహిళలకు రాజ్యసభలోనే పార్లమెంట్ లోని అసెంబ్లీలోని 33% రిజర్వేషన్ల కోసం అనే కార్యక్రమాలు చేసిందని, దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళల యొక్క ఆత్మ గౌరవం కోసం అనేక ఉద్యమాలను కొనసాగించిందని ఆయన అన్నారు. రాజాలరత్నం మాట్లాడుతూ మహిళ సాధారణ కోసం హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటాలు చేస్తున్నామని, వ్యవసాయ కార్మికులకు సరైనటువంటి గుర్తింపు, వేతనాలు లేవని ఏది ఏమైనా సరే మహిళల హక్కుల కోసం మేము ముందే నిలబడతామని ఆమె అన్నారు. మానకొండ మాట్లాడుతూ రాబోయే కాలంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఇప్పటికి కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పై సరైన చట్టాలు లేకుండా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ సభలో దుమ్మలదేవి బి ఏగులయ్య తదితరులున్నారు. తమ డిమాండ్లను ఈ సందర్భంగా ఈ నినాదాలు చేసారు

  1. మోసపూరిత. ‘ నారీ వందన్’ వద్దు
    సమానత్వం- అధికారం కావాలి !
  2. మోడీ కోరుకునే రామరాజ్యం ఎలాంటిది ?
    రేపిస్టులు ఎధేచ్యగా సంచరించేది!
  3. వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల అధిక ధరలు !
    ఇదేనా? మోడీ మార్క్ రామరాజ్యం?
  4. నేడు విద్య, వైద్యం అందుబాటులో లేవు!
    ఇదేనా? మోడీ చెబుతున్న రామరాజ్యం?
    5.మోదీ జీ అబద్ధాలు చెప్పడం ఆపండి!
    రేపిస్టులను రక్షించడం మానండి!
  5. రేపిస్ట్ – నిరంకుశ బి.జె.పి నాయకుల నుండి దేశాన్ని రక్షించండి !
    7.బీజేపీని గద్దెదించు!
    స్త్రీని రక్షించు!
  6. బనారస్-ఢిల్లీ-మణిపూర్..
    మోదీ పాలనలో అత్యాచారాలు, అఘాయిత్యాలు కొనసాగుతూనేవున్నాయి!
    9.రేపిస్టులకు బెయిలు!
    ఆందోళన చేస్తున్న మహిళలకు జైలు!
  7. మతం పేరుతో విడిపోవద్దు!
    కలిసి పోరాడుదాం! బి.జె.పి ని ఓడిద్దాం!
  8. పి.జి వరకు బాలికల విద్యను ఉచితంగా చేయండి!
    12.మూఢనమ్మకాలను-సంప్రదాయవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలి!
    13..వంటగ్యాస్‌ సిలిండర్‌ను 450 రూ . అందజేయాలి!
  9. వితంతువులు, వృద్ధులు, వికలాంగులు , ఒంటరి మహిళలకు నెలకు ₹ 3000 పెన్షన్ ఇవ్వాలి!
  10. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలి!
  11. ఆశా, అంగన్‌వాడీ మధ్యాహ్నభోజన పధకాలతో సహా అన్ని స్కీమ్ వర్కర్లకు కనీస గౌరవ వేతనం ₹ 18,000 ఇవ్వాలి!
  12. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి!
  13. గ్రూపుల్లోని మహిళలందరికీ ఉపాధి కల్పించండి !
  14. మైక్రో ఫైనాన్స్ లను నిషేధించండి ! స్త్రీలను అప్పుల ఊబి నుండి విముక్తి చేయండి!
  15. మోడీ ఎన్నికల ప్రచారకుడు రేపిస్ట్ కునాల్ పాండేని కఠినంగా శిక్షించాలి!.
    వంటి డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article