Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుగ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ కొరకు శిక్షణ:ఐటిడిఎ పీవో ఎం....

గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ కొరకు శిక్షణ:ఐటిడిఎ పీవో ఎం. సూర్యతేజ

బుట్టాయగూడెం.
గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ టూ మెయిన్స్ కు శిక్షణ ఏర్పాట్లు చేస్తామని కోట రామచంద్రపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎం .సూర్యతేజ తెలిపారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మెటీరియల్ ను పివో సూర్యతేజ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఓ సూర్యతేజ మాట్లాడుతూ కె ఆర్ పురం ఐటీడీఏ ద్వారా గత నెల 27వ తేదీ నుండి ఈ నెల 23వ తేదీ వరకు గిరిజన యువతకు కాకినాడకు చెందిన శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గ్రూప్ 2పరీక్షకు స్క్రీనింగ్ టెస్ట్ కు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన యువతకు గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు కూడా శిక్షణను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రూప్ 2 మెయిన్స్ కు అర్హత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పివీ. శ్రీనివాస్ నాయుడు, ఏపీడి ఎం. నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article