ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల వ్యాప్తంగా గ్రామగ్రామాన సోమవారం రామనామ పఠణం జరిగింది. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మండల వ్యాప్తంగాఉన్న రామాలయాల్లోను, ఆంజనేయస్వామి దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రతిగ్రామంలో ఇంటింటా ఉగాది పండుగకు మించి భక్తిశ్రద్ధలతో గడిపారు. గ్రామాల్లో ఉన్నరామాలయాలోనూ, ఆంజనేయస్వామి దేవాలయాల్లోను
విశేషపూజలు అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ముదిగుబ్బ మండలకేంద్రంలో ఆర్యవైశ్యసంఘ మహిళలు పెద్దఎత్తున భజనలతో గ్రామపురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ భజనలు చేసుకుంటూ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో శ్రీరాముని పతాకాలను ఇంటింటా ఎగురవేశారు.