గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలకు జగన్ సూచన
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
అన్నా మీరే గౌరవంగా తప్పుకోండి. గెలిచేవారికి మీ స్థానాల్లో అవకాశం ఇద్దాం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోరారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని చెప్పొద్దు మా వ్యక్తిగత కారణాలతోనే పోటీకి దూరంగా ఉన్నామని ప్రజలకు చెప్పండిని తెలియజేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిచాక మీకు ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు ఇస్తానని అన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చెప్తున్న మాట ఇది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపగా మరికొందరు కినుక వహించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్లిన పెద్దగా ఒరిగేదేమీ లేకపోవడంతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోక తప్పదని భావిస్తున్నారు.