రామచంద్రాపురం:మండలంలోని నెన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి(80) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గురువారం నెన్నూరు గ్రామానికి చేరుకుని గోపాల్ రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అన్నివిధాల అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. ఆయన వెంట మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ ఉన్నారు.