దైవదర్శనానికి వచ్చి ప్రాణాలు విడిచిన వైనం!
వేలేరుపాడు:వేలేరుపాడు మండలం కట్టుకూరు గోదావరి రేవులు స్నానానికై దిగి ప్రమాదవశాత్తు తల్లీ కొడుకులు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది, ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట గ్రామానికి చెందిన పదిమంది కటుకూరులోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనానికై వచ్చారు, దర్శనం అనంతరం సమీపానగల గోదావరిలో స్నానాలు చేసేందుకై దిగగా, ప్రమాదవశాత్తు అల్లం శెట్టి నాగమణి 45, అల్లం శెట్టి తేజ శ్రీనివాస్ 23, అనే ఇరువురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు విషయం తెలుసుకున్న మండల అధికారులు ఎంపీడీవో శ్రీహరి, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లచే ఇరువురి మృతదేహాలను వెలికి తీసి కుటుంబీకులకు అప్పగించడం జరిగింది.ఇరువురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.

