*తలా పాపం తిలా పిరికెడు…
*వైసీపీ జమానావారికి తప్పని జైలు జీవితం…
*వ్యూహాత్మక రచన లో లోకేష్
*రెడ్ బుక్ తో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్…
*పీఎస్ ఆర్ అరెస్ట్ ఐపీఎస్ లకు మాయని మచ్చ అవుతుందా…
*ఇవి చట్టానికి సంకెళ్లేనా..?
*నాలుగో సింహం నవ్వుల పాలఎయినట్లేగా…
- రాజకీయ చట్రం లో పావులుగా మారితే …
- ఐపీఎస్ లంటే ఇక గౌరవం లేనట్లేనా ..
- దేశం సిగ్గుపడాల…గర్వపడాల..
- కాదంబరి తో ఖాకీలకు చుక్కలు మొదలైనట్లేగా..
- ఐజి డీఐజీ డీజీ లే అల్లరి పాలు అవుతుంటే…
- ఇంకెక్కడి పోలీస్…ఇంకెక్కడి ప్రజానీకం…
- ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కు పరాకాష్ట కాదా…
- ఓ పోలీసన్న మీ జీవితగమ్య మేమిటన్న…
- మీ వ్యవస్థ కే కళంకితం తెచ్చారు గా అన్నలు …
- ఈ సమాజానికి చీకటి రోజులు వచ్చినట్లే…
- మీ స్వామి భక్తి పాడుగాను
- అధికారం ఆశాస్వితం… మీరు శాస్వితమన్నది మరిచితిరే….
- మంచి చెడు దేవుడికెఱుక మీ మచ్చ తీసిపోనిది గా..
- న్యాయమా నీవెక్కడున్నావ్..
- ఇది అంతం కాదు…ఆరంభమే …
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత
ఎన్నికలు రాజకీయ,అధికార వ్యవస్థ లతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయల పాలనను గుర్తు తెచుకుంటారని స్వాతంత్ర్య ము రాక మునుపే చక్రవర్తి రాజగోపాలాచారి నొక్కి ఒక్కాణించి యున్నాడు.సరిగా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇక రాబోవు కాలం లో పూర్వపు పరిస్థితిని ప్రజలు గుర్తుచేసుకుని మనోవేదనకు గురికాక తప్పదేమో అన్న ప్రమాదం లేకపోలేదు. కారణం ప్రజాస్వామ్య వ్యవస్థ కు పాడు రోజులు వచ్చి పడుతున్నయెమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎందుకు అనేపరిస్థితి ఏర్పడిందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కావచ్చు..ఏమిటా పరిస్థితి అంటే… - ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలున్నాయి అందులో మొదటిది
- లెజిస్లేటివ్, రెండవది ఎగ్జిక్యూటివ్ మూడవది జుడీషియారీ.ఈ మూడు రాజ్యాంగబద్ధమైన మూడు స్తంభాలు.మొదటిది శాసనసభ ( పార్లమెంట్ యొక్క ఉభయ సభలు, అలాగే రాష్త్ర స్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ )
- రెండోవది సర్కారు వారి వివిధ అధికార విభాగాలు ( ఆయా శాఖ మంత్రులతో కలుపుకొని) .మూడోది న్యాయవ్యవస్థ.నాలుగో స్తంభం జర్నలిజం.
- అంటే నిర్భయంగా సత్య అసత్యాలని బట్టబయలు చేయగలిగే జర్నలిజం వ్యవస్థ
- ఈ నాలుగు స్తంభాలలో ఒక న్యాయవ్యవస్థ మినహాయిస్తే మిగిలిన మూడు వ్యవస్థలు కూడా నిత్యం ప్రజాక్షేత్రం లో నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రజలతో మమేకమై ఉండాల్సిందే. ఈ మూడు వ్యవస్థలు గాడి తప్పినప్పుడే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడే వెలువడే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉండి తీరుతుంది.ఇది సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే తీరు. కానీ ప్రతిదీ కూడా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తేకానీ న్యాయం దొరకని పరిస్థితి ఉంది. పలుకుబడి ఉన్నోడికి తప్ప పేదలకు న్యాయం అన్నది అందని ద్రాక్షలాగా తయారు అయ్యింది.
- ఇలా ఎందుకు అంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఆ విదంగా ఉన్నాయి.దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విదంగా ఒక నవ్యాంధ్రప్రదేశ్ లోనే పోలీస్ వ్యవస్థ అవినీతి మరక అంటించుకుని అభాసు పాలవతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎస్ అంటే ఇంతలా దిగజారి పోతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సాధారణ పోలీస్ ఏదయినా తప్పు చేసి సమాజంలో దోషిగా ఉండచ్చు. అకుంఠిత దీక్ష,కఠోర శ్రమ అలుపెరుగని పోరాటం తో దేశంలో నే పేరున్న వరుసలో ఉండే ఐపీఎస్ లు ఇలా రాజకీయ వికృత క్రీడలో పావులుగా మారుతున్నారనే ప్రచారం జరగడం అసాధారణ విషయం కాదు.ఐపీఎస్ లు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు…ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు.కానీ ఇలా పరువు తక్కువ పనులు చేసారనే అపవాదు మూట గట్టుకోలేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంక్షోభాలు చవి చూసిన సందర్భాలు ఉన్నాయి.అనునిత్యం ఫ్యాక్షన్ తో రగిలి పోయి ఎక్కడ ఎప్పుడు ఏ తుపాకీ పెళుతుందో ఎక్కడ ఏబాంబ్ లు పెళతాయో ఎక్కడ ఎవరి తల తెగి పడుతుందో తెలియని వైచిత్రి లో కూడా ఐపీఎస్ లు ఎంతో సమర్థవంతంగా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. పీడితప్రజల కోసం నక్షలిజం ఉదృతం గా ఉన్న రోజుల్లో ఎక్కడ ఏ మైన్స్ పేలి ఎంత మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతాయో తెలిసి కూడా ఐపీఎస్ లు దీటుగా ఎదుర్కొని అన్నిటికీ జవాబు ఇచ్చే స్థాయి నుంచి ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంచి,స్థాయికి మించి ప్రవర్తించి తప్పులు చేసారని ఒక డిజిపి స్థాయి అధికారి అయిన పీఎస్ ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక మాయని మచ్చ .తప్పు చేసారా లేదా అన్నది తరువాత సంఘతి ఇప్పుడు సమాజంలో తప్పుడు అధికారులు గా ముద్ర వేసుకుని ఉంటే పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠ దిగజారి పోతుంది. ముంబయ్ నటి కాదంబరి జైత్వాని కథలో మొదలైన ఐపీఎస్ ల అరెస్ట్ ల పర్వం నాటి ఎంపి నేటి ఉప సభాపతి కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ సంకేల్లు చట్టానికేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ వ్యవస్థ తప్పు దారిలో నడిచిన అమ్మో సంకెళ్లు తప్పవని భయపడే సమాజం ఆ సంకెళ్ళ కే బేడీలు పడే దుస్థితి దాపురించడం అంటే ఇంత కన్నా దుర్మార్గపు పనులు ఉన్నాయా అని అనుమానం కలుగుతోంది. ఏ రోజు ఏ ఐపీఎస్ పై ఆరోపణలు వస్తాయో ఎవరు కటకటాలు లేక్కిస్తారో తెలియని అయోమయ స్థితిలో ఐపీఎస్ లు ఉన్నారని ఆలోచన చేస్తేనే దేశం సిగ్గు పడాలా లేదా అన్నది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వామి భక్తి రాజకీయ పార్టీలు వేసే ముష్టి పదవుల పందేరం లో పావులుగా మారి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎస్ తమ పరువు పోయే పరిస్థితికి దిగజారి పోయేలా ప్రవర్తించార నే ప్రచారం జరుగుతుంటే పరువుకే పరువు పోలేదా అన్న ప్రచారం జరుగుతోంది.
- గత ప్రభుత్వ విధానాలపై యువగలం లో రెడ్ బుక్ రెడీ గా ఉందని పదే పదే చెప్పిన యువనేత భావి ముఖ్యమంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఒక్కొక్కటిగా పేజీ తిరగేస్తుంటే ఎవరికి ముప్పు తిప్పలు వచ్చి పడతాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- ఒక ఐపీఎస్ కావాలంటే ఎంతటి కష్టమో ఆ ఐపీఎస్ కు ఈ సమాజంలో ఉన్న పరువు ప్రతిష్ట ఎంత గొప్పదో తెలిసిందే. పాప పుణ్యాలు దేవుడి కెరుక నేడు ప్రజల దృష్టిలో ఇలా పరువు దిగజార్చు కునే పరిస్థితి రావడం ,ఐపీఎస్ లపై పడ్డ మచ్చ చెరిగి పోని విదంగా పరిస్థితి తయారవ్వడం అనేది యావత్ భారతావని జీర్ణించుకోలేనిది. ఎందుకిలా ఈ పరిస్థితి కి ఐపీఎస్ లు దిగజారి పోయారా లేక డిగాజార్చేచేసేరా అన్నది వారికే తెలియాలి.
- ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందా అన్న అనుమానం కలుగుతోంది. ఇలాంటి దుస్థితి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలీస్ వ్యవస్థ ఎప్పుడు తన పరువు నిలబెట్టుకుంటుందో చూడాలి మరి.