2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా టైటిల్ గా సినిమా రానుంది. గోద్రా ఈ పేరు వినగానే మనకు గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. దాదాపు 21 ఏళ్ల క్రితం జరిగిన సమర్మతి ఎక్స్ప్‌స్ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మూవీని తెరక్కిస్తున్నారు. తాజాగా మూవీ టీం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఇక టీజర్ చూస్తే.. 2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం సబ్ టైటిల్స్ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర అంటూ టీజర్ ను ముగించారు. ఇక ఈ సినిమా విషయాన్నికి వస్తే.. బీజే పురోహిత్ రామ్ కుమార్ పాల్ నిర్మిస్తుండగా.. ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రణవీర్ షోరే, మనోజ్ జోషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీని మార్చి 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ చేయనున్నారు.